పింఛను ఖాతాలో రూ.52 కోట్లు.. షాక్‌లో వృద్ధుడు

ప్రధానాంశాలు

Published : 18/09/2021 05:02 IST

పింఛను ఖాతాలో రూ.52 కోట్లు.. షాక్‌లో వృద్ధుడు

పింఛను ఖాతాలో రూ.52 కోట్ల బ్యాలెన్స్‌ చూసిన ఆ వృద్ధ రైతుకు నోట మాట రాలేదు. బిహార్‌ రాష్ట్రం కటిహార్‌లోని ఇద్దరు విద్యార్థుల ఖాతాల్లో రూ.960 కోట్లు జమ అయిన కొద్దిగంటల్లోనే ముజఫర్‌పుర్‌లో వృద్ధుడి ఘటన వెలుగుచూడటం చర్చనీయాంశమైంది. బిహార్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి. ఇటీవల ఖగడియాలో ఓ యువకుడి ఖాతాలో రూ.5.5 లక్షలు జమ అయ్యాయి. ఈ డబ్బులు ఎక్కడినుంచి వచ్చిపడుతున్నాయో తెలియక అధికారులు తలలు పట్టుకొంటున్నారు.  నగదు జమ అయినా వినియోగించుకునేందుకు అధికారులు అనుతించకపోవడంతో లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. ఉత్తర్‌ బిహార్‌ గ్రామీణబ్యాంకు ఖాతాలో డబ్బు ఎంతుందో చూసుకునేందుకు సీఎస్‌పీ ఆపరేటర్‌ వద్దకు వెళ్లినప్పుడు ఆధార్‌ పరిశీలన కోసం బొటనవేలు పెట్టగానే రూ.52 కోట్ల బ్యాలెన్స్‌ కనిపించిందని వృద్ధ రైతు రామ్‌ బహదూర్‌ షా మీడియాకు వెల్లడించారుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన