కోయ భాషలో బోధనను అభినందించిన ఉపరాష్ట్రపతి

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

కోయ భాషలో బోధనను అభినందించిన ఉపరాష్ట్రపతి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని 8 జిల్లాల్లో 920 పాఠశాలల్లో కోయ భాషలో ప్రాథమిక విద్యా బోధన అమలు చేస్తుండటంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తంచేశారు. గిరిపుత్రుల మాతృభాషలోనే పుస్తకాలు రూపొందించి చదువు చెప్పేందుకు చొరవ తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి విద్యాశాఖకు అభినందనలు తెలియజేస్తున్నట్లు ఆదివారం ఆయన ట్వీట్‌ చేశారు. మాతృభాషలో బోధన అత్యంత ఆవశ్యకం అని అభిప్రాయపడ్డారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన