సర్కారు పరిశీలనలో కొలీజియం సిఫార్సులు

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

సర్కారు పరిశీలనలో కొలీజియం సిఫార్సులు

దిల్లీ: హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు వివిధ హైకోర్టులు సిఫార్సు చేసిన వందకుపైగా పేర్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆధ్వర్యంలోని కొలీజియం పరిశీలించింది. వారిలో 68 మందిని 12 హైకోర్టుల జడ్జీలుగా నియమించాలని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందులో కర్ణాటకకు చెందిన ఇద్దరి పేర్లను, జమ్మూ-కశ్మీర్‌కు చెందిన ఒకరి పేరును మూడోసారి పంపించడం గమనార్హం. మరో పది మంది పేర్లను రెండోసారి సిఫార్సు చేసింది. మిగిలిన పేర్లన్నీ కొత్తవే. దేశంలోని మొత్తం 25 హైకోర్టుల్లో 1,098 జడ్జీ పోస్టులు ఉండగా సెప్టెంబరు ఒకటో తేదీ నాటికి 465 ఖాళీలు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన