రూ.250 కోట్ల హెరాయిన్‌ స్వాధీనం

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

రూ.250 కోట్ల హెరాయిన్‌ స్వాధీనం

గుజరాత్‌ తీరం సమీపంలో దొరికిన ఇరాన్‌ పడవ

అహ్మదాబాద్‌: భారీస్థాయిలో హెరాయిన్‌తో గుజరాత్‌ తీరానికి సమీపంలోని భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన ఇరాన్‌ పడవను భారత్‌ జప్తు చేసింది. ఆ పడవలోని ఏడుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆదివారం అధికారులు తెలిపారు. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళం, తీర రక్షక దళం ఈ మేరకు సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించినట్లు వెల్లడించారు. శనివారం రాత్రి నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో పడవలో 30 నుంచి 50 కేజీల హెరాయిన్‌ను అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.150 కోట్ల నుంచి రూ.250 కోట్లు వరకు ఉంటుందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న పడవలోని సిబ్బంది ఏడుగురూ ఇరాన్‌ జాతీయులేనని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన