విదేశీ పర్యాటకులకు ఇక అనుమతి!

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

విదేశీ పర్యాటకులకు ఇక అనుమతి!

10 రోజుల్లో కేంద్రం ప్రకటన
తొలి 5 లక్షల మందికి ఉచిత వీసాలు

దిల్లీ: దాదాపు ఏడాదిన్నర తర్వాత తొలిసారిగా విదేశీ పర్యాటకులకు తలుపులు తెరుచుకోనున్నాయి. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో త్వరలోనే వారిని భారత్‌లోకి అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ విషయమై 10 రోజుల్లోనే లాంఛనంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా 2020 మార్చిలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి పర్యాటక, ఆతిథ్య, పౌర విమానయాన రంగాలు దారుణంగా దెబ్బతిన్నాయి. వీటికి ఊపునిచ్చేలా కూడా పలు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా విదేశీ పర్యాటకులను ప్రోత్సహించేందుకు ఉచితంగా వీసాలు కూడా ఇవ్వనున్నారు. ఈమేరకు విదేశీ పర్యాటకులకు దేశంలోకి అనుమతించేందుకు గాను తేదీ, విధివిధానాలు తదితర అంశాలపై కేంద్ర హోంశాఖ ఉన్నతాధికారులు సంబంధిత భాగస్వాములతో చర్చలు జరుపుతున్నారు. 2022 మార్చి 31 వరకు లేదా తొలి 5 లక్షల మందికి (ఏది ముందయితే అది విధానంలో) ఉచిత వీసాలు కూడా మంజూరు చేయనున్నారు. ఇందుకు గాను రూ. 100 కోట్లు కేటాయించనున్నారు. స్వల్ప కాలిక పర్యటనలకు వచ్చేవారికి ఉచిత వీసా కార్యక్రమం ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. ఒక నెల రోజులకు గాను ఈ-వీసాకు ఆయా దేశాలను బట్టి ధర ఉంటుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన