170 కి.మీ. వేగంతో దూసుకుపోయిన కేంద్రమంత్రి

ప్రధానాంశాలు

Updated : 20/09/2021 11:36 IST

170 కి.మీ. వేగంతో దూసుకుపోయిన కేంద్రమంత్రి

దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వేపై స్పీడ్‌ టెస్ట్‌

భోపాల్‌: దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ వే పనులు సమీక్షించిన కేంద్ర రహదారులు, రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అక్కడ స్పీడ్‌ టెస్ట్‌ కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన నిర్మాణ దశలో ఉన్న ఆ రహదారిపై 170 కిలోమీటర్ల వేగంతో కారులో దూసుకుపోయారు. డ్రైవర్‌ పక్క సీటులో కూర్చున్న మంత్రి..  పనుల వివరాలను అధికారుల నుంచి తెలుసుకుంటూ అకస్మాత్తుగా కారు వేగాన్ని పెంచమని సూచించారు. డ్రైవర్‌ సీట్లో కూర్చున్న వ్యక్తి మంత్రి సూచనతో ఒక్కసారిగా వేగాన్ని పెంచారు. కొన్ని సెకన్లలోనే 100.. 120.. ఇలా దాటుకుంటూ పోయింది. 170 కిలోమీటర్ల వేగానికి చేరుకోగానే.. ఇక చాలు అంటూ మంత్రి చెప్పారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దిల్లీ-ముంబయి మధ్య ప్రయాణ సమయాన్ని దాదాపు 12 గంటలకు కుదించే ఈ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాన్ని... రూ. 98 వేల కోట్లతో నిర్మిస్తున్నారు. 2023 మార్చికల్లా ఇది పూర్తి కానుంది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన