కడుపు కోసి చూడ కేశములుండు!

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 04:52 IST

కడుపు కోసి చూడ కేశములుండు!

ఉత్తర్‌ప్రదేశ్‌లో చిన్నారికి వెంట్రుకలు తినే అరుదైన వ్యాధి

రాపంజల్‌ సిండ్రోమ్‌ అనే అరుదైన మానసిక వ్యాధితో బాధపడుతున్న నాలుగేళ్ల చిన్నారిని వైద్యులు శస్త్రచికిత్స చేసి కాపాడారు. ఆమె కడుపులో నుంచి 400 గ్రాముల వెంట్రుకలను బయటకు తీశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అహిమా అనే చిన్నారికి ఈ నెల ఒకటో తేదీన కడుపు నొప్పి వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. కడుపులో వెంట్రుకల చుట్ట ఉన్నట్లు గుర్తించారు. అనంతరం పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్‌ ధనేశ్‌ అగ్రహారీ నేతృత్వంలోని వైద్య బృందం శస్త్రచికిత్స నిర్వహించింది. 400 గ్రాముల వెంట్రుకలను బయటకు తీసింది. ఈ సందర్భంగా ధనేశ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇది నాకు కొత్త అనుభవం. సహజంగా ఇలాంటి వ్యాధి 16 ఏళ్లు నిండిన అమ్మాయిల్లో కనిపిస్తుంది. సీటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌ పరీక్షల ద్వారా... ఆమె కడుపులో వెంట్రుకల ఉండ, దారాలు ఉన్నట్లు గుర్తించాం. అవి రెండు అడుగుల పొడవు ఉన్నాయి. వాటిని క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించాం’’ అని తెలిపారు. సాధారణంగా రాపంజల్‌ సిండ్రోమ్‌ మానసిక స్థితి సరిగా లేని వారిలో కనిపిస్తుందని, మానసిక స్థితి బాగానే ఉన్న చిన్నారిలో ఈ వ్యాధి కనిపించడం ఇదే తొలిసారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అహిమా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెను ఆస్పత్రి నుంచి ఇంటికి పంపించేశామని వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన