యువతిని గొలుసులతో బంధించిన బంధువులు

ప్రధానాంశాలు

Published : 21/09/2021 04:46 IST

యువతిని గొలుసులతో బంధించిన బంధువులు

ఝార్ఖండ్‌లో అమానుషం

మూఢ నమ్మకాలతో ఓ యువతిని గొలుసులతో కట్టేసిన ఘటన ఝార్ఖండ్‌లోని విష్టుపుర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల యువతిని ఖార్ఖయి నది ఒడ్డున నెల రోజులుగా గొలుసులతో బంధించినట్లు సమాచారం. పర్సుదీ ప్రాంతానికి చెందిన బాధిత యువతికి దెయ్యం పట్టిందంటూ ఆమె బంధువులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. పవిత్ర ప్రదేశంగా భావించే ఇక్కడ ఆమెను ఉంచితే నయం అవుతుందన్న నమ్మకంతో గొలుసులతో కట్టేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలికి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ అనిమేశ్‌ గుప్తా మాట్లాడుతూ.. యువతి మానసిక పరిస్థితి బాగానే ఉందన్నారు. తన పేరు, చిరునామా సరిగ్గా చెబుతోందని స్పష్టం చేశారు. ఘటనపై విచారణ చేపడుతున్నామని వెల్లడించారు.

30 కేజీల గొలుసులతో..

రాజస్థాన్‌ ప్రతాప్‌గఢ్‌ జిల్లా లాల్‌గఢ్‌ గ్రామ పంచాయతీలో ఇదే తరహా ఘటన జరిగింది. తన భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త.. భార్యను ఓ కాలిపోయిన పూరి గుడిసెలో ఉంచి 30 కేజీల బరువైన గొలుసులతో కట్టేశాడు. మూడు నెలలుగా బాధితురాలు నరకం అనుభవించిందని స్థానికులు చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన