‘అబ్బా జాన్‌’ వ్యాఖ్యలు ముస్లిం వ్యతిరేక నైజానికి నిదర్శనం

ప్రధానాంశాలు

Published : 21/09/2021 04:46 IST

‘అబ్బా జాన్‌’ వ్యాఖ్యలు ముస్లిం వ్యతిరేక నైజానికి నిదర్శనం

యోగి, టికాయిత్‌లపై ఒవైసీ విమర్శలు

అహ్మదాబాద్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, రైతు నేత రాకేశ్‌ టికాయిత్‌లు అబ్బా జాన్‌, చాచాజాన్‌ వంటి పదాలను ప్రయోగించడంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. ముస్లింల పట్ల వారికున్న విద్వేషాన్ని ఇది చాటుతోందని దుయ్యబట్టారు. ‘‘ఆదిత్యనాథ్‌ అబ్బా జాన్‌ పదాన్ని ఎందుకు వాడారు? పితాజీ (తండ్రి) అని వ్యాఖ్యానించి ఉండొచ్చు కదా!’’ అని పేర్కొన్నారు. టికాయిత్‌ చేసిన ‘చాచా జాన్‌’ పద ప్రయోగంపై స్పందిస్తూ.. ముస్లింలకు సంబంధించిన పదాలను ఇలా ఎవరు ప్రయోగించారన్నది నాకు అప్రస్తుతం. అది యూపీ సీఎం కావొచ్చు.. ఈ వ్యక్తి (టికాయిత్‌) కావొచ్చు.. అలాంటి వ్యాఖ్యలు వారి మనస్తత్వానికి దర్పణం పడుతోంది. ముస్లింలకు వారు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతానని ఆద్యినాథ్‌ చెబుతున్నారని, అయితే ఆయన తన రాష్ట్రంలోని ముస్లింలకు చేసిందేమీ లేదని విమర్శించారు.

జైలు అధికారుల నిరాకరణ

సోమవారం అహ్మదాబాద్‌ వచ్చిన ఒవైసీ.. జైల్లో ఉన్న ఎంఐఎం నేత, యూపీలో మాజీ ఎంపీ అతిక్‌ అహ్మద్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అయితే కొవిడ్‌-19 నిబంధనలు, ఇతర కారణాలను చూపుతూ జైలు అధికారులు అనుమతిని నిరాకరించారు. వచ్చే ఏడాది గుజరాత్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన