ఔషధాల నిల్వ కేసులో గంభీర్‌కు ఊరట

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 05:12 IST

ఔషధాల నిల్వ కేసులో గంభీర్‌కు ఊరట

కింది కోర్టులో విచారణపై దిల్లీ హైకోర్టు స్టే

దిల్లీ: కొవిడ్‌-19 ఔషధాలను అక్రమంగా నిల్వ ఉంచి పంపిణీ చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో భాజపా ఎంపీ, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌కు స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో కింది కోర్టులో జరుగుతున్న విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తూ దిల్లీ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. విపత్తు వేళ డబ్బులు ఆశించకుండా ఔషధాలు పంపిణీ చేసిన తమపై కేసు నమోదు చేయడాన్ని సవాలు చేస్తూ గంభీర్‌, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై స్పందన తెలియజేయాల్సిందిగా దిల్లీ ఔషధ నియంత్రణ ప్రాధికార సంస్థను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ ఏడాది డిసెంబరు 8కి వాయిదా వేసింది. అప్పటివరకు కింది కోర్టులో విచారణ కార్యకలాపాలపై స్టే విధించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన