రక్షణ రహస్యాలు పాక్‌కు చేరవేత

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 05:12 IST

రక్షణ రహస్యాలు పాక్‌కు చేరవేత

బెంగళూరులో వస్త్ర వ్యాపారి అరెస్టు
సామాజిక మాధ్యమం ద్వారా ఐఎస్‌ఐ వలపు వల

బెంగళూరు, న్యూస్‌టుడే: దేశ రహస్యాలు, రక్షణ శాఖకు చెందిన ప్రాంతాలు, భవంతుల ఫొటోలను పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ప్రతినిధులకు పంపిస్తున్న ఆరోపణలపై బెంగళూరు నగరానికి చెందిన వస్త్ర వ్యాపారి జితేందర్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ కమాండో వేషం ధరించి, రాజస్థాన్‌లోని బార్మెర్‌ మిలటరీ స్టేషన్‌ సమాచారాన్ని అతను ఐఎస్‌ఐకి పంపించాడని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌ నుంచి రెండు నెలల కిందటే బెంగళూరుకు వచ్చి వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించాడని అధికారులు సోమవారం ధ్రువీకరించారు. సైనిక దుస్తులు ధరించి, రక్షణ శాఖ అధికారులు ఉంటున్న నివాస సముదాయాలు, ఇతర వివరాలను సేకరించి పాకిస్థాన్‌కు పంపించాడని ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు వివరించారు. అతని మొబైల్‌ ట్రాకింగ్‌ ద్వారా బెంగళూరులో ఉంటున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ప్రతినిధి ఒకడు అతన్ని ఫేస్‌బుక్‌, ఇతర సామాజిక మాధ్యమాల్లో యువతి పేరిట పరిచయం పెంచుకున్నాడు. తనకు భారతదేశం అంటే ఇష్టమని, రక్షణ శాఖ అధికారులు, వారి వాహనాలంటే అమిత ఇష్టమని చెప్పడంతో తాను కమాండర్‌ వేషాన్ని ధరించి, ఫొటోలు తీసి పంపించానని ప్రాథమిక విచారణలో నిందితుడు అంగీకరించాడని సీసీబీ సంయుక్త పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన