సూడో ఉపగ్రహ తయారీకి రూ.700 కోట్లు

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 06:14 IST

సూడో ఉపగ్రహ తయారీకి రూ.700 కోట్లు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హై ఆల్టిట్యూడ్‌ సూడో శాటిలైట్‌ (హెచ్‌ఏపీఎస్‌)ను రూపొందించేందుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) సిద్ధమవుతోంది. కంబైండ్‌ ఎయిర్‌ టీమింగ్‌ సిస్టమ్‌ (సీఏటీఎస్‌) పేరిట అన్‌మ్యాన్డ్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌ కార్యక్రమంలో భాగంగా రూపొందించే ఈ ఉపగ్రహం కోసం రూ.700కోట్లు వ్యయం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయనున్నట్లు హెచ్‌ఏఎల్‌ ఉన్నతాధికారులు సోమవారం బెంగళూరులో ప్రకటించారు. ఇప్పటికే రూ.50కోట్ల వ్యయంతో హెచ్‌ఏపీఎస్‌ ప్రయోగాత్మక ఉత్పత్తిని సిద్ధం చేస్తున్నారు. ఇది 70 అడుగుల రెక్కలతో రూపొందుతోంది. పూర్తిస్థాయి హెచ్‌ఏపీఎస్‌ పూర్తయ్యేందుకు కనీసం నాలుగేళ్లు పట్టనుంది. 500 కిలోల కంటే ఎక్కువ బరువుండే ఈ హెచ్‌ఏపీఎస్‌ సౌర విద్యుత్తుతో పని చేస్తుంది. దాదాపు 70వేల అడుగుల ఎత్తు ఎగరగలిగే హెచ్‌ఏపీఎస్‌ నెలల తరబడి సేవలందిస్తుంది. టెలీకమ్యూనికేషన్‌, రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ ప్రత్యేకతలతో రూపొందనున్న ఈ ఉపగ్రహం రక్షణ, పౌర సేవలకు ఉపయోగపడనుంది. మానవ రహిత విమానాలు(యూఏవీ), సంప్రదాయ ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్న హెచ్‌ఏపీఎస్‌ కమ్యూనికేషన్‌, సర్వేలెన్స్‌, లైవ్‌ వీడియోలతో పాటు స్పష్టమైన చిత్రాలను తీయగలగుతుంది. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సమర్థమైన రక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుందని హెచ్‌ఏఎల్‌ ప్రకటించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన