పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన కంగన

ప్రధానాంశాలు

Published : 21/09/2021 04:46 IST

పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన కంగన

ముంబయి: గీత రచయిత జావేద్‌ అక్తర్‌ దాఖలు చేసిన పరువునష్టం కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోమవారం న్యాయస్థానంలో హాజరయ్యారు. బెయిలుకు వీలున్న నేరానికి సంబంధించిన కేసులో తాను న్యాయస్థానంలో హాజరుకాకుంటే వారెంటు జారీచేస్తామంటూ తనను పరోక్షంగా బెదిరించడంతో మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంపై నమ్మకం కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా జావేద్‌ అక్తర్‌పై దోపిడీ, నేరపూరిత బెదిరింపు ఆరోపణలతో రనౌత్‌ న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. కేసు విచారణను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలని కోరుతూ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట దరఖాస్తు చేసినట్లు కంగన తరఫు న్యాయవాది తెలిపారు. గతంలో తనకు సహ నటుడితో వివాదం చోటుచేసుకోవడంతో జావేద్‌ అక్తర్‌ తనను, తన సోదరి రంగోలీ చందేల్‌లను దురుద్దేశాలతో నివాసానికి పిలిపించుకున్నారని కంగన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం తనను, తన సోదరిని బెదిరించారని ఆరోపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన