మళ్లీ వ్యాక్సిన్ల ఎగుమతి

ప్రధానాంశాలు

Published : 21/09/2021 04:46 IST

మళ్లీ వ్యాక్సిన్ల ఎగుమతి

కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

దిల్లీ: దేశంలోని మిగులు టీకాలను కొవాక్స్‌ నిమిత్తం ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య ఎగుమతి చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ‘వ్యాక్సిన్‌ మైత్రి’లో భాగంగా దీన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. అయితే, టీకాల అందజేతలో దేశ పౌరులకే అత్యంత ప్రాధాన్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో టీకాల పరిశోధన, అభివృద్ధి, ఉత్పత్తి శరవేగంగా సాగుతోంది. అక్టోబరులో 30 కోట్ల కొవిడ్‌ టీకాలు అందుతాయి. వచ్చే మూడు నెలల్లో 100 కోట్లకుపైగా వ్యాక్సిన్లు వస్తాయి’’ అని మంత్రి వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన