న్యాయసేవల జాగృత కార్యక్రమానికి రండి

ప్రధానాంశాలు

Published : 21/09/2021 04:46 IST

న్యాయసేవల జాగృత కార్యక్రమానికి రండి

రాష్ట్రపతికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆహ్వానం

ఈనాడు, దిల్లీ:  దేశంలో న్యాయం అవసరమైనవారికి ఉచితంగా అందిస్తున్న న్యాయసేవల గురించి ప్రజలను చైతన్యవంతుల్ని చేయడానికి అక్టోబర్‌ 2న గాంధీ జయంతినాడు నిర్వహించే జాగృత కార్యక్రమానికి హాజరుకావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ యు.యు.లలిత్‌లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఆహ్వానించారు. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌లుగా వ్యవహరిస్తున్న వారిద్దరూ సోమవారం ఇక్కడ రాష్ట్రపతిభవన్‌లో రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఈమేరకు విజ్ఞప్తిచేశారు. న్యాయసేవా ప్రాధికార సంస్థ తరఫున అందిస్తున్న ఉచిత న్యాయసేవల గురించి రాష్ట్రపతికి వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన