నీలి చిత్రాల కేసులో గెహనాను అరెస్టు చేయొద్దు

ప్రధానాంశాలు

Updated : 23/09/2021 05:58 IST

నీలి చిత్రాల కేసులో గెహనాను అరెస్టు చేయొద్దు

సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: నీలి చిత్రాల కేసులో నటి గెహనా వశిష్ట్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పిస్తూ బుధవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు రాజ్‌ కుంద్రాకు బెయిల్‌ మంజూరయినందున ఆమెను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఆమెపై ఒకే తరహాలో ఉన్న మూడు కేసులు నమోదయ్యాయని, రెండు కేసుల్లో 133 రోజుల పాటు జైలులో ఉన్నారంటూ ఆమె తరఫు న్యాయవాది చేసిన వినతిని పరిగణనలోకి తీసుకొంది. దర్యాప్తునకు సహకరించాలని ఆమెను ఆదేశించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన