గాంధీ ‘ధోవతి’ శతాబ్ది వేడుకలు

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:21 IST

గాంధీ ‘ధోవతి’ శతాబ్ది వేడుకలు

ఈనాడు డిజిటల్‌, చెన్నై: సామాన్య భారతీయుడిలా మహాత్మాగాంధీ ధోవతిని మాత్రమే ధరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా రామ్‌రాజ్‌ కాటన్‌ ఆధ్వర్యంలో శతాబ్ది వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. తమిళనాడు రాష్ట్రం తిరుప్పూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వందమంది చేనేత కార్మికులు, వంద మంది స్వాతంత్య్ర పోరాట అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వంద మొక్కలు నాటారు. కార్యక్రమాన్ని రామ్‌రాజ్‌ కాటన్‌ ఎండీ కె.ఆర్‌.నాగరాజన్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా 40 ఏళ్లుగా 40 వేల మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ‘మహాత్మావై కొండాడువోం’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన