అంతరిక్ష వాతావరణ అంచనాలపై సౌర జ్వాలల ప్రభావం

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:28 IST

అంతరిక్ష వాతావరణ అంచనాలపై సౌర జ్వాలల ప్రభావం

దిల్లీ: సూర్యుడి నుంచి వెలువడే జ్వాలలు.. అంతరిక్ష వాతావరణ అంచనాల్లో కచ్చితత్వాన్ని ప్రభావితం చేస్తున్న తీరును భారత శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు. భూకక్ష్యలోని ఉపగ్రహాలను భద్రంగా ఉంచడానికి ఈ అంచనాలు చాలా కీలకం. భారత్‌ ప్రయోగించనున్న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం నుంచి వచ్చే డేటాను విశ్లేషించడానికి ఈ అధ్యయన వివరాలు దోహదపడతాయని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ తెలిపింది. భూమికి చేరువలో అంతరిక్షం వద్ద సౌర గాలులు, ఇతర పరిస్థితులను అంతరిక్ష వాతావరణంగా పేర్కొంటారు. అవి అంతరిక్షంలోని, భూమి మీదున్న సాంకేతిక వ్యవస్థల పనితీరును దెబ్బతీయగలవు. సూర్యుడి నుంచి కరోనల్‌ మాస్‌ ఎజెక్షన్లు (సీఎంఈ) వెలువడుతుంటాయి. వాటిలో భారీగా అయస్కాంత క్షేత్రం కలిగిన ప్లాస్మా ఉంటుంది. దీనివల్ల అంతరిక్ష వాతావరణంలో గందరగోళాలు తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌కు చెందిన వాగేశ్‌ మిశ్ర నేతృత్వంలోని ఖగోళశాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. సూర్యుడి నుంచి వచ్చే ప్లాస్మాకు సంబంధించిన లక్షణాల్లోను, సీఎంఈలు భూమికి చేరే సమయాల్లోను చాలా మార్పులు ఉండొచ్చని వారు గుర్తించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన