న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:28 IST

న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలి

జస్టిస్‌ రమణకు బార్‌ అసోసియేషన్‌ లేఖ

దిల్లీ: సుప్రీంకోర్టు న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆ న్యాయస్థానం బార్‌ అసోసియేషన్‌.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు లేఖ రాసింది. వీటిని వివరించి, చర్చించడం కోసం కార్యనిర్వాహక కమిటీ సభ్యులకు సమయం ఇవ్వాలని కోరింది. అర్హులైన న్యాయవాదులను హైకోర్టు జడ్జీలుగా ఎంపిక చేయడం, సీనియార్టీ కేటాయించడం వంటి అంశాలు ఉన్నాయని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ తెలిపారు. జడ్జీలుగా పదోన్నతులు కల్పించడానికి సెర్చి కమిటీ ద్వారా అర్హులైన న్యాయవాదుల జాబితా ఇచ్చామని పేర్కొన్నారు. వాటిని సంబంధిత హైకోర్టు కొలీజియం, హైకోర్టు బార్‌ అసోసియేషన్లు పరిశీలించేలా చూడాలని కోరారు. సీనియర్‌ న్యాయవాదులుగా గుర్తింపు ఇచ్చేందుకు ఏర్పాటయిన కమిటీ ఏడాదికి రెండుసార్లు సమావేశమయ్యేలా చూడాలని తెలిపారు. ఛాంబర్లు కేటాయించడంపైనా నిర్ణయం తీసుకోవాలని కోరారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన