రమణ్‌ సింగ్‌, సంబిలకు ఊరట

ప్రధానాంశాలు

Updated : 23/09/2021 06:00 IST

రమణ్‌ సింగ్‌, సంబిలకు ఊరట

టూల్‌కిట్‌ వ్యవహారంలో దర్యాప్తుపై స్టే ఎత్తివేతకు సుప్రీం నిరాకరణ

దిల్లీ: ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌, భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రలకు ఊరట కలిగించేలా బుధవారం సుప్రీంకోర్టు నిర్ణయం వెలువరించింది. టూల్‌కిట్‌ కేసు వ్యవహారంలో వారిపై విచారణ జరగకుండా ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు స్టే ఇవ్వగా దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ‘‘ఈ కేసుపై ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టే నిర్ణయం తీసుకోనీయండి. టూల్‌కిట్‌ వ్యవహారంలో దేశంలోని చాలామంది స్టే ఉత్తర్వులు, ఇతరత్రా ఉపశమనాల కోసం కోర్టులను ఆశ్రయించారు. ఈ ఒక్క కేసును ఎందుకు ప్రత్యేకంగా చూడాలి?’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి స్పందిస్తూ రాజకీయ కారణాలతో కేసు పెట్టినట్టు హైకోర్టు వ్యాఖ్యానించిందని చెప్పారు. ‘‘ఈ దశలో హైకోర్టు ఇంకేం నిర్ణయం తీసుకుంటుంది? వాస్తవాలపై విచారణ జరగాలి కదా!’’ అని అన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ‘‘మీ శక్తిని వృథా చేసుకోవద్దు. మేం జోక్యం చేసుకోలేం. హైకోర్టు త్వరగా నిర్ణయం తీసుకోనీయండి. కేసును నిర్ణయించే సందర్భంలో ఆ వ్యాఖ్యలు అడ్డంకిగా ఉండబోవు’’ అని తెలిపింది. కేసును త్వరగా విచారించాలని హైకోర్టును సూచించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన