కొవిడ్‌ పరిహార నిర్ణయం భేష్‌ : సుప్రీం

ప్రధానాంశాలు

Published : 24/09/2021 04:54 IST

కొవిడ్‌ పరిహార నిర్ణయం భేష్‌ : సుప్రీం

దిల్లీ: కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.50వేల వంతున పరిహారం చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు ప్రశంసించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన రెండు అఫిడవిట్లను పరిగణనలోకి తీసుకుంటున్నామని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నల ధర్మాసనం గురువారం తెలిపింది. ‘‘అత్యధిక జనాభా, ఇతర సమస్యలు ఉన్నప్పటికీ ఏ ఇతర దేశమూ చేయలేని విధంగా కొవిడ్‌ బాధితులకు ఎంతో కొంత సాయాన్ని అందించడానికి భారతదేశం ముందుకు వచ్చింది. చాలా కుటుంబాలకు ఇది ఉపశమనం కలిగిస్తుంది’’ అని పేర్కొంది. మరణ ధ్రువీకరణ పత్రాల జారీపై నెలకొనే వివాదాల పరిష్కారానికి అక్టోబరు 4న కొన్ని మార్గదర్శకాలను జారీ చేస్తామని వెల్లడించింది. జిల్లాల్లోని ఫిర్యాదుల పరిష్కార కమిటీలకు ఆసుపత్రుల నుంచి మరణించిన వ్యక్తుల రికార్డులను తెప్పించుకొనే అధికారాలను తమ ఆదేశాల ద్వారా కల్పిస్తామంది. ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఒక సూచన చేస్తూ...మృతుల తరఫువారు జిల్లాల్లోని ఫిర్యాదుల పరిష్కార కమిటీని కలిసి కనీస సాక్ష్యంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నివేదికను సమర్పించాలన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన