అఫ్గాన్‌పై ఐక్యంగా ముందుకు సాగుదాం

ప్రధానాంశాలు

Updated : 24/09/2021 05:41 IST

అఫ్గాన్‌పై ఐక్యంగా ముందుకు సాగుదాం

మానవ హక్కుల పరిరక్షణకు తాలిబన్లను జవాబుదారీ చేద్దాం

భద్రతామండలి శాశ్వత సభ్యదేశాలకు అమెరికా పిలుపు

ఐరాస: అఫ్గానిస్థాన్‌ విషయంలో ఐక్యంగా ముందుకు సాగుదామని ఐక్యరాజ్య సమితి భద్రత మండలిలోని సహ శాశ్వత సభ్య దేశాలకు అమెరికా పిలుపునిచ్చింది. ఆ దేశంలో మానవ హక్కుల పరిరక్షణకు తాలిబన్లు జవాబుదారీగా ఉండేలా కృషిచేద్దామని పేర్కొంది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, చైనా, రష్యాలకు భద్రత మండలిలో శాశ్వత సభ్యత్వం ఉంది. వీటిని పి-5 దేశాలుగా పిలుస్తారు. ఐరాస సర్వసభ్య సమావేశాలు న్యూయార్క్‌లో జరుగుతున్న నేపథ్యంలో.. ఈ ఐదు దేశాల విదేశాంగ మంత్రులు, ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌ బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అఫ్గాన్‌ పరిస్థితులు సహా పలు అంశాలపై చర్చించారు. భేటీలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ ప్రస్తావించిన విషయాలను ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ వెల్లడించారు. ‘‘అంతర్జాతీయ శాంతిభద్రతల కోసం పి-5 దేశాల నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని సమావేశంలో బ్లింకెన్‌ పిలుపునిచ్చారు. అఫ్గాన్‌ విషయంలో కలిసికట్టుగా ముందుకు సాగాలని.. ఆ దేశంలో మానవ, ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా నివారించాలని పేర్కొన్నారు. మానవ హక్కుల పరిరక్షణ తాలిబన్లను జవాబుదారీగా చేయాలన్నారు’’ అని ప్రైస్‌ వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన