రాష్ట్రాల వల్లే పెట్రో భారం!

ప్రధానాంశాలు

Updated : 24/09/2021 05:44 IST

రాష్ట్రాల వల్లే పెట్రో భారం!

కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పురి

కోల్‌కతా: వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి పెట్రోలు, డీజిల్‌ను తీసుకొచ్చేందుకు రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం వల్లే దేశంలో వాటి ధరలు తగ్గడం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి ఆరోపించారు. రాష్ట్రాలు అధికంగా పన్నులు విధించడం వల్లే పెట్రోలు, డీజిలు ధరలు ఎక్కువగా ఉంటున్నాయని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని భవానీపుర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రచార నిమిత్తం గురువారం కోల్‌కతా వచ్చిన కేంద్ర మంత్రి.. పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పన్ను ఆదాయంతో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన