రోడ్డు ప్రమాదం కేసులో.. మృతుడి కుటుంబానికి రూ.87 లక్షల పరిహారం

ప్రధానాంశాలు

Published : 24/09/2021 05:16 IST

రోడ్డు ప్రమాదం కేసులో.. మృతుడి కుటుంబానికి రూ.87 లక్షల పరిహారం

ఠానే: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాతపడటంతో.. ఆయన కుటుంబానికి రూ.87 లక్షలకు పైగా పరిహారం చెల్లించాల్సిందిగా.. బీమా కంపెనీ, ప్రమాదానికి కారణమైన ట్రక్కు యజమానిని మహారాష్ట్రలోని ఠానేలో ‘మోటార్‌ ప్రమాద క్లెయిముల ట్రైబ్యునల్‌ (మాక్ట్‌)’ ఆదేశించింది. రాజస్థాన్‌లోని చురూ నగరానికి చెందిన జీవ్‌రాజ్‌ సింగ్‌ (36) వస్త్రాల ప్యాకేజింగ్‌ వ్యాపారం చేసేవారు. 2016 ఫిబ్రవరి 4న మహారాష్ట్రలోని రాజ్‌నోలీ గ్రామంలో ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. ట్రక్కు ఢీకొట్టడంతో ఆయన మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదానికి సంబంధించి మృతుడి కుటుంబం దాఖలు చేసిన క్లెయిమ్‌ పిటిషన్‌ను అదనపు సెషన్స్‌ జడ్జి, మాక్ట్‌ సభ్యుడు ఎం.ఎం.వలీమొహమ్మద్‌ పరిష్కరించారు. మృతుడి కుటుంబానికి రూ.87.29 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. క్లెయిమ్‌ దాఖలైన తేదీ నుంచి 7% వార్షిక వడ్డీతో ఆ సొమ్మును ముట్టుజెప్పాలని సూచించారు. రెండు నెలల్లోగా చెల్లింపు పూర్తికాకపోతే.. వడ్డీరేటును 8%కు పెంచి తదనుగుణంగా పరిహారం అందించాలని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన