కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇళ్లవద్దే టీకాలు

ప్రధానాంశాలు

Published : 24/09/2021 05:16 IST

కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇళ్లవద్దే టీకాలు

ఈనాడు, దిల్లీ: కదల్లేని స్థితిలో ఉన్నవారు, దివ్యాంగులకు మొబైల్‌ వ్యాక్సినేషన్‌ బృందాల ద్వారా ఇళ్ల వద్దే కొవిడ్‌ టీకాలు అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొంది.

* జైడస్‌ క్యాడిలా టీకాలు ఇవ్వడంపై తయారీదార్లతో చర్చలు జరుగుతున్నాయని కేంద్రం వెల్లడించింది. ధర ఇంకా తేలాల్సి ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వి.కె.పాల్‌ తెలిపారు.

చివరి దశలో కొవాగ్జిన్‌ పరీక్షలు

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ టీకాపై చేస్తున్న పరీక్షలు చివరి దశలో ఉన్నాయని డాక్టర్‌ పాల్‌ చెప్పారు.

* నొవావాక్స్‌ టీకా అత్యవసర వినియోగానికి అనుమతించాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు చేశామని ఆ సంస్థతో పాటు, దాని భాగస్వామి సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన