కుల జనగణనపై విపక్షాలు రాజకీయం: భాజపా

ప్రధానాంశాలు

Published : 25/09/2021 05:01 IST

కుల జనగణనపై విపక్షాలు రాజకీయం: భాజపా

దిల్లీ: కుల జనగణనపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ(భాజపా) ఆగ్రహం వ్యక్తం చేసింది. అందరితో కలిసి అందరి అభివృద్ధి (సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌) చేయడమే తమ లక్ష్యమని పేర్కొంది. పాలనాపరంగా భారమవుతుందని, కుల జనగణన చేయడం సాధ్యం కాదంటూ గురువారం కేంద్రం సుప్రీం కోర్టు ముందు ప్రమాణ పత్రం దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో భాజపా అధికార ప్రతినిధి సుధాంషు త్రివేదీ.. విపక్షాల తీరుపై విమర్శలు గుప్పించారు. కుల జనగణన డిమాండ్‌ చేస్తున్న నాయకులు.. తమ పార్టీలో మాత్రం వెనుకబడిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆరోపించారు. ‘‘సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ను భూమి పుత్రుడు అంటారు. కానీ ఆయన చివరకు తన కొడుకునే వారసుడిగా ఎంపిక చేసుకున్నారు. మాయావతిని ఆమె అభిమానులు అక్క అని సంభోధిస్తారు. కానీ ఆమె తన సోదరుడి భవిష్యత్‌ కోసమే పాటుపడుతోంది’’ అంటూ త్రివేదీ ఎద్దేవా చేశారు. సాంకేతిక కారణాల ఆధారంగానే కుల జనగణనపై తమ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మోదీ హయాంలో గత ఏడేళ్లుగా అమెరికాతో సంబంధాలు బలోపేతమయ్యాయని పేర్కొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన