పర్యావరణ మార్పులతో ప్రపంచ భద్రతకు ముప్పు

ప్రధానాంశాలు

Published : 25/09/2021 05:01 IST

పర్యావరణ మార్పులతో ప్రపంచ భద్రతకు ముప్పు

భద్రతామండలిలో పలు దేశాల ఆందోళన

ఐరాస: పర్యావరణంలో ప్రతికూల మార్పుల కారణంగా ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లుతోందని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ప్రపంచవ్యాప్తంగా హింస కూడా పెరుగుతుంటుందని పేర్కొంది. పర్యావరణ మార్పులపై భద్రతామండలిలో తాజాగా జరిగిన సమావేశంలో ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరెస్‌, ఐర్లాండ్‌ అధ్యక్షుడు మైఖేల్‌ మార్టిన్‌, వియత్నాం అధ్యక్షుడు గుయెన్‌ షుయాన్‌, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ సహా పలువురు ప్రసంగించారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సంక్షోభాలు తలెత్తాయని మార్టిన్‌ గుర్తుచేశారు. పర్యావరణంలో ప్రతికూల మార్పులను ‘తుపాకీ కాల్పులు లేని యుద్ధం’గా షుయాన్‌ అభివర్ణించారు. వాతావరణ పరిరక్షణ దిశగా భద్రతామండలి సత్వరం చర్యలు చేపట్టాలని బ్లింకెన్‌ పిలుపునిచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన