ఓబీసీ లెక్కలు ఇవ్వని వారూ విమర్శించడమా?

ప్రధానాంశాలు

Published : 25/09/2021 05:01 IST

ఓబీసీ లెక్కలు ఇవ్వని వారూ విమర్శించడమా?

కేంద్రంపై శివసేన వ్యాఖ్య

ముంబయి: ఓబీసీ జనాభా లెక్కలను రూపొందించడం కష్టమంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రమాణ పత్రం సమర్పించడాన్ని శివసేన తప్పుపట్టింది. తన విధులను సక్రమంగా నిర్వర్తించని భాజాపా ఓబీసీ రిజర్వేషన్లపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తుండడం ఏమిటని ప్రశ్నించింది. ఈ మేరకు అధికార పత్రిక సామ్నాలో సంపాదకీయం రాసింది. 2011 నాటి సామాజిక, ఆర్థిక, కులపరమైన జనాభా లెక్కలు తప్పులు తడకగా ఉన్నాయని, వాటిని సమర్పించడం పరిపాలనపరంగా కష్టసాధ్యమని కేంద్రం తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం ఈ వివరాలు కావాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన దావాపైనే కేంద్రం ఆ విధంగా సమాధానం ఇచ్చింది. ఓబీసీ వివరాలు ఇవ్వడానికి ఇష్టపడని భాజపా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు కాలేదంటూ విమర్శలు చేస్తోందని సామ్నా వ్యాఖ్యానించింది. మరోవైపు స్థానిక సంస్థల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన అత్యవసర ఆదేశాలపై   సంతకం చేసినందుకు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన