యోగి పేరు వింటే నేరగాళ్లలో వణుకు

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

యోగి పేరు వింటే నేరగాళ్లలో వణుకు

రక్షణ మంత్రి వ్యాఖ్య

మహరాజ్‌గంజ్‌: ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పేరు వింటేనే నేరగాళ్లలో వణుకు పుడుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆదిత్యనాథ్‌ గురువు అవైద్యనాథ్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమని, ఈ విషయంలో యోగి విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన పేరు చెబితే నేరగాళ్ల గుండెలు వేగంగా కొట్టుకుంటాయని అన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు, సనాతన ధర్మం రక్షణకు కృషి చేస్తున్నారని చెప్పారు. ఆయన నిజాయితీని నిద్రలోనూ ఎవరు అనుమానించలేరని ప్రశంసించారు. తాను గోరఖ్‌పుర్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు యోగి అవైద్యనాథ్‌ను దర్శించుకునేవాడినని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ సహకారంతో దేశభద్రతకు రాజ్‌నాథ్‌ కృషి చేస్తున్నారని అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన