జైలుకు డీఆర్డీవో కేసు నిందితులు

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

జైలుకు డీఆర్డీవో కేసు నిందితులు

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా చాందీపూర్‌ డీఆర్డీవో నుంచి రహస్యాలు లీక్‌ చేసిన సంఘటనలో అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు శుక్రవారం బాలేశ్వర్‌ జిల్లా కోర్టులో హాజరుపరిచారు. నిందితులను బాలేశ్వర్‌ జైలుకు తరలించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇప్పటివరకు నిందితులు క్రైం బ్రాంచ్‌ కస్టడీలో ఉండగా శుక్రవారంతో ఆ గడువు ముగిసింది.

రక్షణ రహస్యాల సేకరణకు పాక్‌లో శిక్షణ
కరాచీలో కార్యాలయం ఏర్పాటుచేసి ఇతర దేశాల ఆయుధ పరిశోధన, రక్షణకు సంబంధించిన వివరాలు సేకరించడంపై యువతులు, మహిళలకు పాకిస్థాన్‌ నిఘా విభాగం శిక్షణనిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని ఒడిశా క్రైం బ్రాంచ్‌ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు వారి విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. క్రైం బ్రాంచ్‌ అధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. ‘హనీట్రాప్‌లో చిక్కినవారు పొరుగు దేశానికి రహస్యాలు చేరవేసినట్లు వెలుగులోకి వచ్చింది. నిందితులకు ఓ యువతి యూకే నంబరు నుంచి ఫోను చేసినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేయగా ఆ యువతి పాకిస్థాన్‌నుంచే ఫోన్‌ చేసినట్లు ఆధారాలు లభించాయి. పాకిస్థాన్‌లో శిక్షణ పొందుతున్న మహిళలు, యువతులు మన దేశంలోని రక్షణ విభాగ అధికారులు, సిబ్బందితో పరిచయాలు పెంచుకుంటున్నారు. వారికి తమ నగ్నచిత్రాలు పంపుతూ పెళ్లి చేసుకుంటామని ఆశజూపి కీలక రహస్యాలు సేకరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. రక్షణ శాఖలోని అధికారులు, సిబ్బందితో పరిచయమేర్పడ్డాక ఆ మహిళలు వారికి సంబంధించిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని లింక్‌ పంపినట్లు తేలింది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని దాని ద్వారా సమాచారం సేకరించినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది’ అని వివరించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన