ఏబీసీ ఛైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ

ప్రధానాంశాలు

Published : 25/09/2021 04:58 IST

ఏబీసీ ఛైర్మన్‌గా దేబబ్రత ముఖర్జీ

ముంబయి: ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్స్‌ (ఏబీసీ)కు 2021-22 సంవత్సరానికిగాను యునైటెడ్‌ బ్రెవెరీస్‌ లిమిటెడ్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ అధికారి దేబబ్రత ముఖర్జీ (దేబూ) అధ్యక్షుడిగా, సకాల్‌ పేపర్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌కు చెందిన ప్రతాప్‌ జి.పవార్‌ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. యూబీ గ్రూప్‌ ముఖ్య అధికారిగా ఉన్న దేబబ్రత ముఖర్జీకి పారిశ్రామికరంగంలో 27 ఏళ్ల అపార అనుభవం ఉంది. కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ చేశారు. గతంలో 20 ఏళ్లపాటు కోకొకోలాలో పనిచేసి ఉపాధ్యక్షుడి హోదాలో ఆ కంపెనీ నుంచి బయటికివచ్చి, 2018లో హిందుస్థాన్‌ టైమ్స్‌ గ్రూపులో చేరారు. 2019లో యూబీ గ్రూపులోకి వచ్చారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన