గుజరాత్‌ వజ్రాల కంపెనీపై ఐటీ దాడులు

ప్రధానాంశాలు

Published : 26/09/2021 05:37 IST

గుజరాత్‌ వజ్రాల కంపెనీపై ఐటీ దాడులు

రూ.కోట్లలో పన్ను ఎగవేత

దిల్లీ: మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్రాల్లోని ప్రముఖ వజ్రాల తయారీ, ఎగుమతిదారుల కంపెనీపై సెప్టెంబరు 22 నుంచి వరుసగా మూడు రోజులు తాము జరిపిన దాడుల్లో రూ.కోట్ల పన్ను ఎగవేతను గుర్తించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) అధికారులు శనివారం వెల్లడించారు. ఈ కంపెనీ పలకల (టైల్స్‌) తయారీ వ్యాపారం కూడా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. సూరత్‌, నవాసారి, మోర్బీ, వాంకానేర్‌, ముంబయి నగరాల్లో ఐటీ  దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు.. ఖాతాలు చూపకుండా రూ.518 కోట్ల మేర మెరుగు పట్టిన చిన్న వజ్రాల క్రయవిక్రయాలు సాగించినట్లు వెల్లడైందని అధికారులు తెలిపారు. మొత్తం రూ.2,742 కోట్ల మేర చిన్న వజ్రాలు విక్రయించినట్లు ఖాతాల పుస్తకాల్లో ఉందని, మరోవైపు.. నగదు రూపంలోనూ పెద్దఎత్తున జరిపిన క్రయవిక్రయాల బిల్లులు మాయం చేశారని చెప్పారు.

చెన్నైలో రూ.300 కోట్లు..

చెన్నైలో రెండు ప్రైవేటు సిండికేట్‌ ఫైనాన్సింగ్‌ గ్రూపులపై  జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.300 కోట్ల మేర అనామతు ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ అధికారులు  తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన