సీతారాం ఏచూరికి మాతృవియోగం

ప్రధానాంశాలు

Published : 26/09/2021 05:37 IST

సీతారాం ఏచూరికి మాతృవియోగం

ఈనాడు, దిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాతృమూర్తి కల్పకం ఏచూరి (89) శనివారం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కన్నుమూశారు. అనారోగ్యంతో ఉదయం ఆసుపత్రిలో చేరిన ఆమె సాయంత్రం 4 గంటల సమయంలో తుది శ్వాస విడిశారు. ఆమె భౌతిక కాయాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం ఎయిమ్స్‌కి అప్పగించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కల్పకం చెన్నైలో 1933 జూన్‌ 23న పాపాయమ్మ, మద్రాస్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ కందా భీమశంకరం దంపతులకు జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్‌కందా ఈమె తోబుట్టువే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి సోమయాజులును కల్పకం వివాహమాడారు. సీతారాం ఏచూరి వీరి పెద్ద కుమారుడు. కల్పకం ఏచూరి మద్రాస్‌ స్టెల్లా మేరీస్‌ కళాశాలలో బీఏ, బెనారస్‌ హిందూ యూనివర్శిటీలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఫిల్‌ చేశారు. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌తో కలిసి దిల్లీ, హైదరాబాద్‌ కేంద్రంగా ఆంధ్రమహిళా సభ నిర్వహణలో పాలుపంచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సాంఘిక సంక్షేమబోర్డు సభ్యురాలిగా, సంగీత నాటక అకాడమీ సభ్యురాలిగా సేవలందించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన