అఖండ భారత్‌ అంటే మనసులను కలపడమే

ప్రధానాంశాలు

Published : 26/09/2021 05:37 IST

అఖండ భారత్‌ అంటే మనసులను కలపడమే

దేశ విభజనపై జరిగిన వెబినార్‌లో రాంమాధవ్‌

దిల్లీ: దేశ విభజన కేవలం భూభాగాల మధ్యే కాదు.. మనసులు మధ్య కూడా ఏర్పడిందని భాజపా నేత.. ఆరెస్సెస్‌ పదాధికారి రాంమాధవ్‌ అన్నారు. దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని.. వీటి మధ్య ఇప్పుడు వంతెనలు నిర్మించాలని పిలుపిచ్చారు. ‘అఖండ భారత్‌’ ఉద్దేశమూ అదేనని తెలిపారు. మానసిక గోడలను కూల్చాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఆయన శనివారం జవహార్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ‘విభజన ఘోరాలు’ అంశంపై జరిగిన అంతర్జాతీయ వెబినార్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా వేర్పాటు వాదాన్ని నమ్మే శక్తులను బలహీన పరచాలని అన్నారు. నిర్ణయలోపాల కారణంగానే దేశ విభజన జరిగిందని తెలిపారు.

‘‘భారత్‌ విభజనను ఆ సమయంలో జరిగిన మిగతా దేశాల విభజనల్లా చూడకూడదు. ఇది ఎన్నో ఏళ్ల నుంచి నివసిస్తున్న హిందువులు, ముస్లింలు రెండు వేర్వేరు దేశాలకు చెందిన వారన్న తప్పుడు వాదంతో ఏర్పడింది’’ అని మాధవ్‌ చెప్పారు. పాకిస్థాన్‌ వ్యవస్థాపకుడు మహ్మద్‌ అలీ జిన్నాయే విభజనకు కారణమన్న మాధవ్‌.. ఆయన్ను రాక్షసుడితో పోల్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన