రేప్‌ కేసులో ఎంపీకి ముందస్తు బెయిల్‌

ప్రధానాంశాలు

Published : 26/09/2021 05:37 IST

రేప్‌ కేసులో ఎంపీకి ముందస్తు బెయిల్‌

దిల్లీ: మానభంగం కేసులో లోక్‌ జనశక్తి పార్టీ పార్లమెంటు సభ్యుడు ప్రిన్స్‌ రాజ్‌కు దిల్లీ కోర్టు శనివారం ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో ఎంపీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదులో అసాధారణ జాప్యం జరుగుతున్నట్లు ఆరోపణ ఉంది. రూ.లక్ష బాండు, మరో పూచీకత్తుతో ప్రత్యేక జడ్జి వికాస్‌ ధుల్‌ ఈ బెయిలు మంజూరు చేస్తూ కనాట్‌ ప్లేస్‌ ఠాణా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అధికారులకు అందుబాటులో ఉండాలని, బాధితురాలిపై ఏ రూపంలోనూ ఏవిధమైన ఒత్తిడి తీసుకురావద్దని ఎంపీ రాజ్‌కు సూచనలు చేశారు. బాధితురాలితోపాటు ఆమె స్నేహితుడు కొన్ని ఆడియో, వీడియో ఆధారాలను అడ్డుపెట్టుకొని ఎంపీని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు రాజ్‌ తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసులో కస్టోడియల్‌ విచారణ అవసరం లేదని, సాక్ష్యాధారాలన్నీ సీజ్‌ చేసినందున వాటిని తారుమారు చేసే అవకాశం కూడా లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇందుకు అనుగుణంగా ముందస్తు బెయిలు మంజూరు చేసింది. మాచ్కీజీజి కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాసవాన్‌కు మేనల్లుడైన రాజ్‌ బిహార్‌లోని సమస్తీపుర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన