డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలి

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:25 IST

డ్రగ్స్‌ స్మగ్లింగ్‌పై ఎన్‌ఐఏతో దర్యాప్తు జరిపించాలి

ప్రధానికి హిందూమహాసభ లేఖ

ఈనాడు, దిల్లీ: అఫ్గానిస్థాన్‌ నుంచి ముంద్రాపోర్టు ద్వారా విజయవాడ చిరునామాతో నమోదైన ఓ ట్రేడింగ్‌ కంపెనీ పేరిట వచ్చిన రూ.21వేల కోట్ల విలువైన 3వేల కేజీల హెరాయిన్‌పై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని అఖిలభారత హిందూ మహాసభ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం మహాసభ ప్రధాన కార్యదర్శి జీవీఆర్‌ శాస్త్రి లేఖరాశారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్వాధీనంగా పేరుపొందిన ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించి లోతుగా విచారణ జరిపించాలని శాస్త్రి విజ్ఞప్తి చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన