యూపీ కేబినెట్‌లో జితిన్‌ ప్రసాదకు స్థానం

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:25 IST

యూపీ కేబినెట్‌లో జితిన్‌ ప్రసాదకు స్థానం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న భాజపా.. ఆదివారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించింది. ఓటర్లపై ప్రభావం చూపే కీలక నేతలకు కేబినెట్‌లో స్థానం కల్పించింది. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన సీనియర్‌ నేత జితిన్‌ ప్రసాదకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. బ్రాహ్మణవర్గ ఓటర్లలో ఈయనకు  పట్టుంది. ఇది తమకు కలిసొస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ప్రసాదతోపాటు మరో ఆరుగురి చేత మంత్రులుగా గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుల సంఖ్య గరిష్ఠస్థాయిలో 60కు చేరింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన