పంజాబ్‌లో తొలి కేబినెట్‌ విస్తరణ

ప్రధానాంశాలు

Published : 27/09/2021 04:40 IST

పంజాబ్‌లో తొలి కేబినెట్‌ విస్తరణ

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదివారం తొలి కేబినెట్‌ విస్తరణ చేపట్టింది. కాగా, కెప్టెన్‌ మంత్రివర్గంలో పనిచేసిన చాలామందికి ఉద్వాసన పలకడంతో పార్టీలో అపుడే ముసలం పుట్టింది. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కొత్త మంత్రుల చేత పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో కలిపి కేబినెట్‌లో మంత్రుల సంఖ్య 18కి చేరింది. సీఎం పీఠం నుంచి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ వైదొలిగాక.. కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ, ఉప ముఖ్యమంత్రులుగా సుఖ్‌జిందర్‌ సింగ్‌ రంధావా, ఒ.పి.సోని ఇప్పటికే ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అవినీతి ఆరోపణలున్న మాజీ మంత్రి రాణా గుర్జిత్‌సింగ్‌కు మంత్రివర్గంలో మళ్లీ అవకాశం ఇవ్వడాన్ని ప్రశ్నిస్తూ కొంతమంది కాంగ్రెస్‌ నేతలు పీసీసీ అధ్యక్షుడు  సిద్ధూకు లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని సీఎంకు కూడా పంపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన