అమెజాన్‌ అంటే.. ఈస్టిండియా కంపెనీ 2.0

ప్రధానాంశాలు

Updated : 27/09/2021 06:19 IST

అమెజాన్‌ అంటే.. ఈస్టిండియా కంపెనీ 2.0

ప్రభుత్వ పెద్దలకు రూ.కోట్లలో లంచాలు

ఆరెస్సెస్‌ పత్రికలో సంచలన కథనం

దిల్లీ: ఆన్‌లైన్‌ చెల్లింపుల (ఈ-కామర్స్‌) రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ అమెజాన్‌ అంటే ‘ఈస్టిండియా కంపెనీ 2.0’ లాంటిదేనంటూ ఆరెస్సెస్‌ అనుబంధ ‘పాంచజన్య’ వారపత్రిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పైపెచ్చు ప్రభుత్వ విధానాలు తమకు అనుకూలంగా ఉండేలా ఈ కంపెనీ కోట్లాది రూపాయలు లంచాలు ఇస్తోందంటూ సంచలన విషయాలు వెల్లడించింది. అక్టోబర్‌ 3న మార్కెట్లోకి రానున్న తాజా సంచికలో ఈ వారపత్రిక ‘అమెజాన్‌’పై ముఖచిత్ర కథనం ప్రచురించింది. భారత్‌పై గుత్తాధిపత్యం కోసం 18వ శతాబ్దంలో ఈస్టిండియా కంపెనీ ఏదైతే చేసిందో.. ఇపుడు అమెజాన్‌ నడవడిలోనూ అవే ఛాయలు కనిపిస్తున్నట్లు ఆ వ్యాసంలో పేర్కొంది. భారత మార్కెటుపై ఏకఛత్రాధిపత్యం సాధించేందుకు ఈ కంపెనీ మన పౌరుల వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ స్వాతంత్య్రాన్ని హరిస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేసింది. అమెజాన్‌ వీడియో వేదిక ‘ప్రైమ్‌ వీడియో’లో విడుదల అవుతున్న సినిమాలు, టీవీ సీరియళ్లు మన సంస్కృతికి విరుద్ధమని ‘పాంచజన్య’ ధ్వజమెత్తింది. ఈ కంపెనీ పరోక్షంగా పలు సంస్థలను ఏర్పాటుచేసి, వాటి ద్వారా లంచాలు ఇస్తున్నట్లు పత్రిక పేర్కొంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన