బంద్‌ వల్ల ఇబ్బంది కలిగితే రైతుల కోసం మన్నించండి

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:41 IST

బంద్‌ వల్ల ఇబ్బంది కలిగితే రైతుల కోసం మన్నించండి

 దేశ ప్రజలకు రాకేశ్‌ టికాయిత్‌ విజ్ఞప్తి

గాజియాబాద్‌: భారత్‌ బంద్‌ వల్ల ప్రయాణికులకు, సాధారణ ప్రజలకు కలిగిన ఇబ్బందులపై భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ టికాయిత్‌ విచారం వ్యక్తం చేశారు. రైతుల కోసం ఒక్కరోజు కలిగిన అసౌకర్యాన్ని మన్నించాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌కు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన రావడాన్ని మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజల నుంచి లభించిన మద్దతుగా భావిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమాన్ని కొందరు కేవలం పంజాబ్‌, హరియాణా, యూపీ రాష్ట్రాల సమస్యగానే చిత్రీకరించే యత్నం చేశారు. సోమవారం నాటి భారత్‌ బంద్‌కు లభించిన స్పందనను బట్టి ఇది దేశ ప్రజలందరి పోరాటమ’’ని స్పష్టమవుతుందన్నారు. పది నెలలుగా రైతులు ఇళ్లు, పొలాలను వదిలిపెట్టి రహదారులపైనే జీవిస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నిరసన కార్యక్రమాల్లో బంద్‌ పాటించడం ఒకటని చెబుతూ ఇలాంటి వాటివల్ల ఇబ్బందులు కలగడం సహజమేనన్నారు. అయితే, రైతుల డిమాండ్ల సాధన కోసం ఈ అసౌకర్యానికి మన్నించాలని కోరారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన