రాజ్యసభకు సర్బానంద ఏకగ్రీవం

ప్రధానాంశాలు

Published : 28/09/2021 04:49 IST

రాజ్యసభకు సర్బానంద ఏకగ్రీవం

మరో కేంద్ర మంత్రి మురుగన్‌ సహా ఐదుగురు కూడా

దిల్లీ, ఈనాడు, గువాహటి: కేంద్ర మంత్రి, అస్సాం మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ సోమవారం రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అస్సాం నుంచి ఖాళీగా ఉన్న ఏకైక స్థానానికి సర్బానంద ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఆయన ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్‌ నుంచి కేంద్ర మంత్రి ఎల్‌.మురుగన్‌, పుద్దుచ్చేరి నుంచి భాజపా అభ్యర్థి ఎస్‌.సెల్వగణపతి, తమిళనాడు నుంచి డీఎంకే అభ్యర్థులు కనిమొళి ఎన్‌వీఎన్‌ సోము, కేఆర్‌ఎన్‌ రాజేశ్‌కుమార్‌లు, మహారాష్ట్ర నుంచి కాంగెస్‌ నాయకురాలు రజనీ పటేల్‌ పోటీలేకుండానే రాజ్యసభకు ఎన్నికయ్యారు. పశ్చిమబెంగాల్‌లో సుస్మితా దేవ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) తరఫున రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన