పర్యాటకం కోలుకోవాలంటే టీకానే కీలకం

ప్రధానాంశాలు

Updated : 28/09/2021 06:14 IST

పర్యాటకం కోలుకోవాలంటే టీకానే కీలకం

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు,దిల్లీ: కరోనాతో కుదేలైన పర్యాటక రంగం కోలుకోవాలంటే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కార్యక్రమమే కీలకమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆయన తన శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. కరోనాతో దెబ్బతిన్న పర్యాటక రంగ పునరుద్ధరణ కోసం ఇప్పటికే కేంద్రం అనేక చర్యలు తీసుకుందని, విదేశీయులకు 5 లక్షల ఉచిత వీసాలు కూడా మంజూరు చేసిందని తెలిపారు. వీలైనంత ఎక్కువ మంది వ్యాక్సిన్‌ తీసుకుంటే పర్యాటక రంగం మళ్లీ పుంజుకుంటుందని, ఇప్పటికే దేశంలో 85 కోట్లకు పైగా ప్రజలు టీకాలు వేసుకున్నారని చెప్పారు. దేశీయ పర్యాటక రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని చెప్పిన మంత్రి.. అంతగా ప్రాచుర్యం పొందని, ఎవరికీ తెలియని సూదూర ప్రాంతాలను పరిచయం చేసేందుకు తమ మంత్రిత్వశాఖ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన లోక్‌సభ సభాపతి ఓం బిర్లా మాట్లాడుతూ, ప్రపంచంలో భారత్‌ను నంబర్‌వన్‌ పర్యాటక ప్రాంతంగా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా భారతీయ పర్యాటక గణాంకాలతో రూపొందించిన ‘నిధి 2.0’ (ద నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ డేటాబేస్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ) పోర్టల్‌ను ఓం బిర్లా, మంత్రులు కిషన్‌రెడ్డి, శ్రీపాద యశోనాయక్‌ ప్రారంభించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన