బాలికపై సామూహిక అత్యాచారం

ప్రధానాంశాలు

Published : 29/09/2021 04:59 IST

బాలికపై సామూహిక అత్యాచారం

అనంతరం సిగరెట్‌తో కాల్చి.. చెట్టుకు వేలాడదీసి హత్య

 మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో ఘోరం

మధ్యప్రదేశ్‌లోని సీధీ జిల్లాలో 15ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక త్యాచారానికి అపాల్పడ్డారు. అనంతరం హత్య చేశారు. సీధీ జిల్లాలోని ఓ గ్రామంలో సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో.. సోదరుడిని పాఠశాలలో దింపేందుకు ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లింది. తమ్ముడిని దింపిన అనంతరం వెనక్కి వస్తుండగా.. నలుగురు వ్యక్తులు ఆమెను అడ్డుకున్నారు. బలవంతంగా ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని అడవుల్లోకి తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాలికను చిత్రహింసలు పెట్టారు. కాలుతున్న సిగరెట్‌ను అనేకసార్లు ఛాతీపై రుద్దారు. నొప్పితో ఆ బాలిక విలవిల్లాడుతుంటే చూసి.. పైశాచిక ఆనందాన్ని పొందారు. తర్వాత ఓ చెట్టుకు వెలాడదీసి ఆమె ప్రాణాలు తీశారు. అనంతరం పరారయ్యారు. సాయంత్రం 4 గంటల సమయంలో.. ఓ బాలిక చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మైనర్‌ మృతదేహాన్ని కిందికి దింపారు. హత్యాచారం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన