కుటుంబ పింఛను మంజూరులో...వికలాంగుల ఆదాయ అర్హత పరిమితి పెంపు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 04:59 IST

కుటుంబ పింఛను మంజూరులో...వికలాంగుల ఆదాయ అర్హత పరిమితి పెంపు

వెల్లడించిన రక్షణ శాఖ

దిల్లీ: ‘కుటుంబ పింఛను’పై ఆధారపడే వికలాంగుల ఆదాయ అర్హత నిబంధనను కేంద్ర రక్షణశాఖ సవరించింది. మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారుని సంతానం లేదా తోబుట్టువులు మానసిక, శారీరక వికలాంగులైతే... వారికి కుటుంబ పింఛను ప్రయోజనం వర్తిస్తుంది. అయితే, ఇతరత్రా మార్గాల ద్వారా వారికి సమకూరే నెలవారీ ఆదాయం మాత్రం రూ.9 వేలు మించకూడదు. ఇప్పటివరకూ అమలవుతున్న ఈ నిబంధనలో మార్పు చేసినట్టు రక్షణశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘రూ.9 వేల గరిష్ఠ ఆదాయ పరిమితిని పెంచుతున్నాం. మృతిచెందిన ప్రభుత్వ ఉద్యోగి/పింఛనుదారుని సంతానం లేదా తోబుట్టువుల నెలవారీ ఆదాయం కుటుంబ పింఛను మొత్తం కంటే తక్కువ ఉంటే సరిపోతుంది’’ అని పేర్కొంది. ఉద్యోగి లేదా పింఛనుదారుడు చనిపోవడానికి ముందు చివరిసారి అందుకున్న మొత్తంలో 30%తో పాటు... కరవు భత్యాన్ని కలిపి కుటుంబ పింఛనుగా చెల్లిస్తారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన