భారత్‌-పాక్‌ల మధ్య చర్చలపై ఐరాస ఆశాభావం

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:10 IST

భారత్‌-పాక్‌ల మధ్య చర్చలపై ఐరాస ఆశాభావం

ఐరాస: భారత్‌-పాక్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నప్పటికీ.. ఉభయ దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని ఐక్యరాజ్య సమితి (ఐరాస) వ్యక్తం చేసింది. ఐరాస సర్వ ప్రతినిధి సభ సమావేశాల సందర్భంగా ఇటీవల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తన ప్రసంగంలో జమ్మూ-కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తిన సంగతి తెలిసిందే. దీన్ని తిప్పికొడుతూ భారత యువ దౌత్య వేత్త స్నేహా దూబే దీటైన జవాబిచ్చారు. పాక్‌ ‘ఉగ్రవాద’ వైఖరిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు. ఈ పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియా గుటెర్రస్‌ అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజారిక్‌ మాట్లాడారు. ఉభయ దేశాల మధ్య చర్చలు జరుగుతాయన్న ఆశాభావంతోనే ఉన్నామని, ఈ చర్చలు ‘తెరవెనుక దౌత్యం’తో జరిగే అవకాశం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన