ఆత్మనిర్భర్‌ భారత్‌కు నిలువెత్తు నిదర్శనం

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:13 IST

ఆత్మనిర్భర్‌ భారత్‌కు నిలువెత్తు నిదర్శనం

 నూతన పార్లమెంటు భవనం నిర్మాణంపై కేంద్రం

దిల్లీ: నైపుణ్యం, వేగం, ప్రమాణాల విషయంలో నూతన పార్లమెంటు ప్రాంగణం స్మారక నిర్మాణంగా నిలిచిపోతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్ర పేర్కొన్నారు. దీని ఆకృతి రూపకల్పన నుంచి నిర్మాణానికి ఉపయోగించిన వస్తువుల వరకూ అన్నీ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినవేనన్నారు. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ఈ నిర్మాణం ఓ నిలువెత్తు నిదర్శనంలా ఉంటుందన్నారు. 2020 డిసెంబరులో ప్రధాని శంకుస్థాపన చేసిన ఈ సౌధ నిర్మాణం నిర్దేశిత లక్ష్యం 2022 అక్టోబరు కల్లా పూర్తవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి మహా నిర్మాణాలు ఇంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయడం చాలా అరుదన్నారు. మొజాయిక్‌ శైలిలో ఎరుపు, పసుపు రంగు రాళ్ల అమరికతో ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఇది కవల సోదరిలా కనిపిస్తుందని చెప్పారు. ఇప్పటివరకూ ఈ నిర్మాణం కోసం 6 లక్షల పనిదినాలను సృష్టించినట్లు తెలిపారు. 45 రోజుల్లో 1.65 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తొలగించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకూ 72 వేల ఘనపుప మీటర్ల కాంక్రీట్‌ను వినియోగించినట్లు వెల్లడించారు. ఈ నిర్మాణం కోసం 404 చెట్లను వేరే చోటికి తరలించామని, అందులో 80 శాతం బతికాయని చెప్పారు. అందుకు బదులుగా 4,400 మొక్కలను నాటినట్లు తెలిపారు. దేశంలోని 20కి పైగా ప్రాంతాల్లో పార్లమెంటుకు అవసరమైన ఫర్నీచరు, విద్యుత్తు, సాంకేతిక పరికరాలు తదితర వస్తువుల తయారీ జరుగుతున్నట్లు చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన