భవానీపుర్‌ ఉప ఎన్నిక యథాతథం

ప్రధానాంశాలు

Published : 29/09/2021 05:31 IST

భవానీపుర్‌ ఉప ఎన్నిక యథాతథం

రద్దుకు కోల్‌కతా హైకోర్టు తిరస్కరణ

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీచేస్తున్న భవానీపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 30న ఉప ఎన్నికను నిర్వహించడానికి కోల్‌కతా హైకోర్టు మంగళవారం అనుమతినిచ్చింది. ఎన్నిక రద్దు కోసం పిటిషనర్‌ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. బెంగాల్‌లో రాజ్యాంగ సంక్షోభ పరిస్థితిని నిలువరించడానికి భవానీపుర్‌ ఎన్నికను త్వరగా నిర్వహించాలంటూ ఈసీకి గత నెలలో లేఖ రాసిన ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌.కె.ద్వివేది తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఆయన ‘ప్రజా సేవకుడిగా కన్నా ఎక్కువగా అధికార పార్టీ సేవకుడిగా’ నిరూపించుకుంటున్నారని వ్యాఖ్యానించింది. ఈసీకి రాసిన లేఖలో ద్వివేది తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని, కాబట్టి భవానీపుర్‌ ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ ఫయాన్‌ సిన్హా అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. భవానీపుర్‌ ఉప ఎన్నికను త్వరగా నిర్వహించకపోతే రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందని ద్వివేది పేర్కొన్నారని, ఓ వ్యక్తి గెలుపు లేదా ఓటమి కారణంగా రాజ్యాంగానికి వచ్చే ప్రమాదం ఏంటో ఆయన వివరించలేదని కోర్టు పేర్కొంది. భవానీపుర్‌లో మమత పోటీ చేస్తారన్న విషయం అభర్థిత్వం ఖరారు కన్నా ముందే ప్రధాన కార్యదర్శికి ఎలా తెలిసిందని ప్రశ్నించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన