అధునాతన డ్రోన్లు.. జాబిల్లి రాకెట్‌

ప్రధానాంశాలు

Published : 29/09/2021 05:31 IST

అధునాతన డ్రోన్లు.. జాబిల్లి రాకెట్‌

కళ్లుచెదిరే సాధన సంపత్తికి వేదికగా చైనా వైమానిక ప్రదర్శన

ఝుహాయ్‌: చైనా అట్టహాసంగా భారీ వైమానిక ప్రదర్శన ప్రారంభించింది. అధునాతన సాంకేతిక సత్తాను ప్రపంచం ఎదుట చాటింది. గాల్లో 50 వేల అడుగుల ఎత్తులో ఏకబిగిన 20 గంటల పాటు విహరించగల సైనిక డ్రోన్‌, అనేక యుద్ధవిమానాలు, క్షిపణులు, ఇతర ఆయుధ పరిజ్ఞానాలను తొలిసారిగా ప్రదర్శించింది. ఆదివారం వరకూ కొనసాగే ఈ కార్యక్రమంలో మరిన్ని ఆకర్షణలు ఉండబోతున్నాయి. చంద్రుడి వద్దకు మానవులను తీసుకెళ్లే రాకెట్‌ను ఆవిష్కరించనుంది. అది జాబిల్లి కక్ష్యలోకి 25 టన్నుల బరువును మోసుకెళ్లగలదు.

చైనా కొత్తగా ప్రదర్శించిన డ్రోన్‌ పేరు సీహెచ్‌-6. ఇది రెండు టర్బోఫాన్‌ ఇంజిన్ల సాయంతో పనిచేస్తుంది. శత్రువుల విమానాలు, క్షిపణుల రాక గురించి హెచ్చరికలు చేసే రాడార్‌ను మోసుకెళ్లగలదు. అలాగే గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఇతర ఆయుధాలను దీనికి అమర్చవచ్చు. ఎలక్ట్రానిక్‌ యుద్ధవ్యవస్థలు కలిగిన జె-16డి విమానాన్ని కూడా తొలిసారిగా ప్రదర్శించింది. కేవలం 800 గ్రాముల బరువు కలిగిన మినీ అటాక్‌ డ్రోన్‌ సీహెచ్‌-817ను కూడా.. ప్రపంచానికి చూపబోతోంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన