ఉద్యోగంలో చేరడానికి ముందు నుంచి సీనియారిటీ వర్తించదు

ప్రధానాంశాలు

Updated : 29/09/2021 06:30 IST

ఉద్యోగంలో చేరడానికి ముందు నుంచి సీనియారిటీ వర్తించదు

కారుణ్య నియామకం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: ఒక వ్యక్తి ఉద్యోగంలో చేరడానికి ముందు నుంచే పూర్వవర్తిత్వ సీనియారిటీ (రెట్రోస్పెక్టివ్‌ సీనియారిటీ) పొందడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు, నిబంధనల మేరకే ఈ సీనియారిటీని వర్తింప జేయాల్సి ఉంటుందని పేర్కొంది. సాధారణంగా ఉద్యోగంలో చేరిన తర్వాతే ఎవరైనా సీనియారిటీ ప్రయోజనాలను అందుకునే అవకాశం ఉంటుందని చెప్పింది. కారుణ్య నియామకానికి సంబంధించిన ఓ కేసు విషయంలో... జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌ల ధర్మాసనం మంగళవారం ఈ వ్యాఖ్యలు చేసింది. బిహార్‌కు చెందిన ఓ హోంగార్డు మరణించగా, కారుణ్య నియామకాల ద్వారా అతని కుమారుడికి ఉద్యోగమివ్వాలని కమిటీ 1985లో ప్రతిపాదించింది. ఆ వ్యక్తికి ప్రమాణాల మేరకు శారీరక దారుఢ్యం లేదు. దీంతో ఈ నియామకం చేపట్టలేదు. సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థాన ఆదేశాల మేరకు 1996లో ప్రభుత్వం అతడిని అధినాయక్‌ లిపిక్‌గా నియమించింది. 1985 నుంచే సీనియారిటీని వర్తింపజేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించగా, అనుకూల తీర్పు వచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన