సచిన్‌ జోషీకి తాత్కాలిక బెయిలు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:34 IST

సచిన్‌ జోషీకి తాత్కాలిక బెయిలు

 నగదు అక్రమ చలామణీ కేసులో మంజూరుచేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: నగదు అక్రమ చలామణీ కేసులో సినీ నటుడు సచిన్‌ జోషీకి సుప్రీంకోర్టు మంగళవారం నాలుగు నెలల తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. తన కక్షిదారుకు వైద్య చికిత్స అందించాల్సిన అవసరం ఉందన్న ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఆ మేరకు ఆదేశాలు జారీచేసింది. విచారణ న్యాయస్థానం విధించిన షరతులకు లోబడి తాత్కాలిక బెయిలు మంజూరు చేసినట్లు స్పష్టం చేసింది. బెయిలు పొడిగింపునకు సంబంధించి తదుపరి ఎలాంటి దరఖాస్తులను అనుమతించబోమని తెలిపింది. ముంబయికి చెందిన స్థిరాస్తి సంస్థ ఓంకార్‌ రియల్టర్స్‌తో కలిసి రూ.100 కోట్ల మేర నగదు అక్రమ చలామణీకి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై సచిన్‌ జోషి అరెస్టైన సంగతి తెలిసిందే. మురికివాడల పునరావాస ప్రాధికారసంస్థ పథకం పనులకు సంబంధించి మోసానికి పాల్పడినట్లు ఓంకార్‌ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన